బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ ఆరు కూరగాయలు బెస్ట్!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 25, 2025

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మేలు. ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా చేయగలవు. 

Photo: Pexels

ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ, జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఫైబర్ చాలా తోడ్పడుతుంది. కొన్ని కూరగాయాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలోని పోషకాలు ఓవరాల్ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. అలాంటి ఆరు రకాల కూరగాయలు ఏవంటే.. 

Photo: Pexels

చిలగడదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చిలగడదుంపల్లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. 

Photo: Pexels

100 గ్రాముల బ్రసెల్ స్పౌట్స్ (చిన్న క్యాబేజీ)లో సుమారు 3.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవటంతో పాటు చాలా ప్రయోజనాలు ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యే వారికి చాలా సహాయపడుతుంది. 

Photo: Pixabay

క్యారెట్‍లోనూ ఫైబర్ ఎక్కువే. 100 గ్రాముల క్యారెట్‍లో 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా డైట్‍లో క్యారెట్ తీసుకుంటే బెస్ట్. 

Photo: Pexels

100 గ్రాముల బ్రోకలీలో దాదాపు 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లతో పాటు కీలకమైన పోషకాలు ఈ కూరగాయలో ఉంటాయి. ఆరోగ్యానికి బ్రోకలీ చాలా మంచిది. 

Photo: Pexels

పచ్చి బఠానీల్లోనూ ఫైబర్ పుష్కలం. 100 గ్రాముల పచ్చి బఠానీల్లో దాదాపు 5.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గేందుకు బఠానీలు తోడ్పడతాయి. 

Photo: Pexels

100 గ్రాముల బీట్‍రూట్‍లో 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్‍కు సహకరించటంతో పాటు ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

Photo: Pexels

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels