కొందరికి వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఆహారం సరిగా అరగదు. అలాంటి వారు సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అలాంటి ఆరు రకాల ఫుడ్స్ ఇక్కడ చూడండి.
Photo: Pexels
కోడిగుడ్లు సులువుగా జీర్ణం అవుతాయి. ఉడికించిన, వండిన గుడ్లు త్వరగా డైజెస్ట్ అవుతాయి. పోషకాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఎనర్జీని కూడా ఇస్తాయి.
Photo: Pexels
చిలగడదుంపలు కూడా చాలా సులువుగా జీర్ణమవుతాయి. పేగులకు మంచి చేస్తాయి. ఇందులో ఇన్‍సోలబుల్ ఫైబర్ ఉంటుంది. ఇతర ఆహారాలు మెరుగ్గా జీర్ణమయ్యేలా కూడా ఇది చేస్తుంది.
Photo: Pexels
అరటి పండు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. డయేరియా లాంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఇది ఉపశమనం కలిగించగలదు. శరీరానికి శక్తిని కూడా అందజేస్తుంది.
Photo: Pexels
యగర్ట్, పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా ఉంటుంది. ఇవి సులభంగా అరగడంతో పాటు మొత్తం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణం మెరుగ్గా అయ్యేలా సహకరిస్తాయి.
Photo: Pexels
సులువుగా జీర్ణమయ్యే వాటిలో అన్నం కూడా ఉంది. ఫైబర్ తక్కువగా ఉండే కారణంగా వైట్ రైస్ త్వరగా అరిగిపోతుంది.
Photo: Pexels
మాంసాహారాల్లో చికెన్ బ్రెస్ట్, చేపలు లాంటివి ఈజీగా జీర్ణమవుతాయి. రెండింటిలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగానే ఉంటాయి. జీర్ణాన్ని మెరుగుపరచడంతో పాటు మంచి ఎనర్జీ ఇవ్వగలవు.
Photo: Pexels
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు