పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ఎక్కువగా ఉండడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గుండె వ్యాధులు, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ లాంటి రిస్క్‌లు పెరుగుతాయి. అందుకే బెల్లీ ఫ్యాట్ ఉంటే కరిగేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
Photo: Pexels
బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు సరైన ఆహారంతో పాటు వ్యాయామాలు, యోగా కూడా చాలా ముఖ్యం. పొట్టచుట్టూ ఉండే కొవ్వు కలిగేందుకు ఐదు యోగాసనాలు ఉపయోగపడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
భుజంగాసనం (కోబ్రా పోజ్).. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఈ ఆసనం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడి అక్కడి కొవ్వు కరిగేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
ధనూరాసనం.. బెల్లీ ఫ్యాట్‍తో పాటు తొడల్లోని కొవ్వు కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరాన్ని ధనస్సులా వంచే ఈ ఆసనం కొవ్వు కరిగేందుకు బాగా సహకరిస్తుంది.
Photo: Pexels
చక్రాసనం కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు తోడ్పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.
Photo: Pexels
సేతు బంధాసనం (బ్రిడ్జ్ పోజ్) రెగ్యులర్‌గా చేయడం వల్ల కడుపు చుట్టూ ఉండే కొవ్వు కరిగేందుకు సహకరిస్తుంది. శరీరానికి మంచి వ్యాయామంగా ఉంటుంది.
Photo: Pexels
నౌకాసనం వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు పొత్తి కడుపు కండరాల దృఢత్వాన్ని పెంచగలదు.