జిమ్‍కు వెళ్లకున్నా ఫిట్‍గా ఉండేందుకు 5 మార్గాలు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 12, 2023

Hindustan Times
Telugu

అందరికీ జిమ్‍లకు వెళ్లడం కుదరదు. అలాంటప్పుడు జిమ్‍కు వెళ్లకున్నా ఫిట్‍నెస్ మెయింటైన్ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు ముఖ్యమైనవి ఇక్కడ చూడండి.

Photo: Unsplash

వాకింగ్‍ చేయండి.. ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల మీ కార్డోవాస్క్యులర్ (గుండె సంబంధిత) ఫిట్‍నెస్ మెరుగవుతుంది. వాకింగ్, రన్నింగ్ వల్ల మీ ఎముకల దృఢత్వం పెరగటం, మీ శరీరంలోని కొవ్వు తగ్గడం, మీ కండరాల బలం పెరగడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Unsplash

రెగ్యులర్‌గా డ్యాన్స్ చేయడం వల్ల కూడా ఫిట్‍నెస్ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గేందుకు, మూడ్ మెరుగయ్యేందుకు, ఒత్తిడి తగ్గేందుకు కూడా డ్యాన్స్ మంచి ఆప్షన్.

Photo: Unsplash

ప్రతీ రోజు కొన్ని మెట్లు ఎక్కడం వల్ల కూడా ఫిట్‍గా ఉండొచ్చు. ఆఫీస్‍లతో పాటు అన్ని చోట్ల లిఫ్టులు కాకుండా మెట్లు ఎక్కి పైకి వెళ్లడం మంచిది. మెట్లు ఎక్కడం వల్ల మీ ఎముకల దృఢత్వం పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.

Photo: Unsplash

ఫిట్‍నెస్ కోసం స్పోర్ట్స్ ఆడడం కూడా మంచి ఆప్షన్. రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్, టెన్నిస్, స్విమ్మింగ్, క్రికెట్, స్క్వాష్ లాంటి ఆటలు ఆడడం వల్ల కూడా ఫిట్‍గా ఉండొచ్చు. స్పోర్ట్ ఆడడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కొవ్వు కరిగేందుకు సహకరించి బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది.

Photo: Unsplash

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలియటంతో పాటు ఫిట్‍గా కూడా ఉండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ చేస్తే మీ శరీర దృఢత్వం, ఫ్లెక్సిబులిటీ పెరుగుతాయి.

Photo: Unsplash

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash