వాటర్ కంటెంట్ అధికంగా ఉండే కూరగాయలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 29, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల కూరగాయల్లో నీరు (వాటర్ కంటెంట్) అధికంగా ఉంటుంది. వీటిని తింటే శరీరానికి హైడ్రేషన్ అందడంతో పాటు మరిన్ని లాభాలు ఉంటాయి. అలా వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఐదు రకాల కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

కీర దోసకాయల్లో నీరు అధికంగా ఉంటుంది. దీంట్లో 95 శాతం వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్, పొటాషియం, మెగ్నిషియమ్, విటమిన్ కే, విటమిన్ ఏ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి కీరదోస చాలా మేలు చేస్తుంది. 

Photo: Pexels

ముల్లంగిలో నీరు పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, బీ6, ఫోలెట్, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ముల్లంగి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. 

Photo: Pexels

వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటిలో సెలరీ కూడా ఉంది. సెలరీలో విటమిన్ కే, పొటాషియం కూడా ఉంటాయి. బరువు తగ్గేందుకు కూడా సెలరీ తోడ్పడుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. 

Photo: Pexels

టమాటాల్లో వాటర్ కంటెంట్‍తో పాటు ముఖ్యమైన విటమన్లు, మినరల్స్ ఉంటాయి. హైడ్రేషన్‍తో పాటు రోగనిరోధక శక్తిని టమాటో మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

క్యాబేజీలోనూ నీరు ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ సీ, బీ6, మెగ్నిషియం, ఐరన్ లాంటి మరిన్ని పోషకాలు కూడా ఉంటాయి. 

Photo: Pexels

మూతి మీద మీసంతో దర్శనం ఇచ్చిన హీరోయిన్ అనన్య పాండే

Instagram