ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారమే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పోషకాలు బాగా అందేలా ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం బ్యాలెన్స్డ్ డైట్ (సమతుల్య ఆహారం) పాటించాలి. దీని కోసం ఐదు చిట్కాలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తప్పనిసరిగా తినడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ పాటించవచ్చు. తక్కువ మోతాదులో అయినా పోషకాలు ఉండే ఆహారం మూడు పూటలా తినడం ముఖ్యం. తినడం స్కిప్ చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.
Photo: Pexels
పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలను తప్పకుండా మీ డైట్‍లో తీసుకోవాలి. ఇవి మీ శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. పూర్తి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా తోడ్పడతాయి.
Photo: Pexels
పెరుగు, మజ్జిగ, యగర్ట్, చీజ్ లాంటి ప్రోబయోటిక్స్ ఆహారంలో తీసుకోవాలి. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్యాస్ లాంటి సమస్యలను నివారిస్తాయి.
Photo: Pexels
ఆహారాల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉప్పు, చెక్కెర వేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బ్యాలెన్స్డ్ డైట్‍లో ఉప్పు, చెక్కెరను పరిమితి మేరకే తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది.
Photo: Pexels
బ్యాలెన్స్డ్ డైట్‍లో జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ఈ ప్రాసెస్డ్ ఆహారాల్లో సాచురేలెట్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగటంతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.