ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Feb 15, 2025
Hindustan Times Telugu
చర్మం ఆరోగ్యంలో తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో కొన్ని పోషకాల లోపం ఉంటే కూడా మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తలెత్తుతాయి.
Photo: Pexels
ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటే కొన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలు తినాలి. ఇవి మొటిమలు తగ్గేందుకు సహకరిస్తాయి. ఆ పోషకాలు ఏవంటే..
Photo: Pexels
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ఫ్లాక్స్, చియా సీడ్స్, వాల్‍నట్స్ లాంటి వాటిలో ఒమేగా-3 ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
ముఖంపై మొటిమలు తగ్గేందుకు జింక్ సహకరిస్తుంది. చర్మంలో ఆయిల్ ఉత్పతిని ఇది నియంత్రిస్తుంది. దీనిద్వారా మొటిమలు తగ్గేలా చేయగలదు. గుమ్మడి గింజలు, శనగలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు లాంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
విటమిన్ డీ, విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాలు చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ విటమిన్లు ఉన్న ఫుడ్స్ రెగ్యులర్‌గా తింటే మొటిమలు తగ్గేందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
ముఖంపై మొటిమలు తగ్గేందుకు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ సహకరిస్తాయి. ఆకుకూరలు, బెర్రీలు, గ్రీన్‍టీ, సిట్రస్ పండ్లు లాంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ.
Photo: Pexels
ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు చర్మానికి మేలు చేస్తాయి. పెరుగు, పన్నీర్, కెఫిర్, యగర్ట్ సహా పులియబెట్టిన ఆహారాల్లో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
రాత్రి పడుకునే ముందు ఈ ఫుడ్స్ తింటే ఇక నిద్రపట్టదు జాగ్రత్త!