ఒత్తిడి ఎక్కువగా ఉంటోందా? ఈ నేచురల్ టిప్స్ పాటించండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Oct 22, 2024
Hindustan Times Telugu
ఇటీవలి కాలంలో చాలా మందిలో మానసిక ఒత్తిడి ఎక్కువవుతోంది. దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిడి తగ్గేందుకు పాటించాల్సిన ఐదు సహజమైన టిప్స్ ఇక్కడ చూడండి.
Photo: Pexels
చెట్ల మధ్య ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. అందుకే వీలైనప్పుడు బయటి ప్రదేశాలకు వెళ్లాలి. దీనివల్ల మెదడు ప్రశాంతమై ఒత్తిడి తగ్గుతుంది.
Photo: Pexels
ఇష్టమైన సంగీతం, పాటలు వినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు శరీరంలో నియంత్రణలో ఉంటాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
Photo: Pexels
ప్రతీ రోజూ ధ్యానం, డీప్ బ్రెత్ టెక్నిక్స్ చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గేందుకు ఇవి చాలా తోడ్పడతాయి.
Photo: Pexels
ప్రతీ రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్ ఎండోర్ఫిన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ఇది సహకరిస్తుంది.
Photo: Pexels
నవ్వడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి. ఒత్తిడి తగ్గేందుకు ఇది ఉపకరిస్తుంది, మూడ్ బాగుంటుంది. అందుకే తరచూ నవ్వే ప్రయత్నం చేయండి.
Photo: Pexels
రెండు లవంగాలను నోట్లో వేసుకొని అలాగే నిద్రపోయారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి