కిడ్నీ బీన్స్ తింటే కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Dec 08, 2023

Hindustan Times
Telugu

కిడ్నీ బీన్స్ (కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్ గింజలు/రాజ్మా) తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. అలా.. కిడ్నీ బీన్స్ తింటే కలిగే లాభాలు ఏవో ఇక్కడ చూడండి.  

Photo: Unsplash

రాజ్మా (కిడ్నీ బీన్స్)లో గ్లిసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ (షుగర్) ఉన్న వారికి ఇది చాలా మేలు. శరీరంలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్సుగా ఉండేందుకు కిడ్నీ బీన్స్ ఉపకరిస్తుంది. 

Photo: Pixabay

కిడ్నీ బీన్స్‌లో ప్రొటీన్ అత్యధికంగా ఉంటుంది. శాకాహారులకు ఇది మాంసానికి అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Photo: Pixabay

కిడ్నీ బీన్స్‌లో తగినంతనే కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్, డియటరీ ఫైబర్ ఉంటాయి. దీంతి ఇవి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ (కొవ్వు) లెవెల్స్ కూడా తగ్గుతాయి. 

Photo: Pixabay

కిడ్నీ బీన్స్‌లో మెగ్నిషియమ్ అధికంగా ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. గుండెపోటు ప్రమాదాన్ని ఇది తగ్గించగలదు. 

Photo: Unsplash

కిడ్నీ బీన్స్‌లో విటమిన్ బీ1 ఉంటుంది. దీంతో ఇవి తింటే మెదడు పనితీరుకు, ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది.

Photo: Pixabay

ఈ వానాకాలంలో అల్లంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

image credit to unsplash