వేసవిలో మీ శరీరాన్ని చల్లబరిచే 5 రకాల హెర్బ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 08, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలం వేడి విపరీతంగా ఉంటుంది. ఇది శరీరానికి ఇబ్బందులను తెస్తుంది. వేసవిలో మీ శరీరం చల్లబడేందుకు సహకరించే ఐదు రకాల  ఐదు రకాల నేచురల్ హెర్బ్స్ (మూలికలు) ఏవో ఇక్కడ చూడండి. ఇవి మీ ఆహారంలో చేర్చుకోండి. 

Photo: Pexels

పుదీనలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయి. మీ డైట్‍లో తీసుకుంటే ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. 

Photo: Pexels

శరీరంలో వేడి నియంత్రణలో ఉండేలా శీతల గుణాలు కొత్తిమీరలో ఉంటాయి. అందుకే వేసవిలో ఇది తినడం చాలా మేలు. కొత్తిమీరలో యాంటిఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

Photo: Pexels

యాలకుల్లోనూ వేడిని తగ్గించే కారకాలు ఉంటాయి. అందుకే మీ ఆహారంలో వీటిని తీసుకుంటే మేలు. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

శరీరంలో వేడి తగ్గేందుకు తులసి ఆకులు కూడా సహకరిస్తాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల చల్లదనంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

Photo: Pexels

శరీరంలో ఉష్ణం తగ్గేందుకు సోంపు కూడా బాగా ఉపయోగపడుతుంది. సోంపు గింజలు నేరుగా నమలడం లేకపోతే దీంతో టీ చేసుకొని తాగడం చేయవచ్చు.

Photo: Pexels

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే