బీట్‌రూట్‌తో 5 రుచికరమైన వంటకాలు

Image Credits: Adobe Stock

By HT Telugu Desk
Feb 11, 2025

Hindustan Times
Telugu

రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి అయిన బీట్‌రూట్ వంటకాలను వెతుకుతున్నారా? ఈ 5 రెసిపీలను మీ బరువు తగ్గించే ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు.

Image Credits: Adobe Stock

బీట్‌రూట్ స్మూతీ

Image Credits: Adobe Stock

బీట్‌రూట్ స్మూతీ ఉదయం పూట లేదా వ్యాయామం తర్వాత శక్తిని పెంచుకోవడానికి అనువైనది. ఉడికించిన లేదా ముడి బీట్‌రూట్‌, అరటిపండ్లు, ఆపిల్ లేదా బెర్రీల వంటి పండ్లతోపాటు కొంత పెరుగు లేదా బాదం పాలతో స్మూతీ చేయొచ్చు

Image Credits : Adobe Stock

బీట్‌రూట్ సలాడ్

Image Credits: Adobe Stock

 బీట్‌రూట్‌ను వేయించండి . ముక్కలు చేసి ఆకుకూరలు, గింజలు, చీజ్‌తో కలపండి. ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ లేదా తేనెను డ్రెస్సింగ్‌గా ఉపయోగించడం వల్ల బీట్‌రూట్ రుచి మెరుగుపడుతుంది. మీరు పుదీనా లేదా తులసి ఆకులు కూడా కలుపుకోవచ్చు.

Image Credits: Adobe Stock

బీట్‌రూట్ రైతా

Image Credits: Adobe Stock

ఉడికించిన బీట్‌రూట్‌ను తురుముకుని పెరుగు, జీలకర్ర,  చిటికెడు ఉప్పు కలపండి. పెరుగుకు ఉండే  క్రీమీ టెక్స్చర్ బీట్‌రూట్ మట్టి రుచిని సమతుల్యం చేస్తుంది. సైడ్ డిష్‌గా ఈ రెసిపీ బాగుంటుంది

Image Credits: Adobe Stock

బీట్‌రూట్ పరోటా

Image Credits: Adobe Stock

బీట్‌రూట్‌ను పరోటా పిండిలో కలపడం వల్ల అది మరింత రుచికరంగా మారుతుంది. తురిమిన బీట్‌రూట్‌ను గోధుమ పిండి, మసాలాలు, నీటితో కలిపి పిండిని తయారు చేయండి. పరోటాలుగా చుట్టి కాల్చండి.  కలర్‌ఫుల్ గా ఉండే రుచికరమైన భోజనం రెడీ అవుతుంది

Image Credits: Adobe Stock

బీట్‌రూట్ అన్నం

Image Credits: Adobe Stock

చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించడమే కాదు. మంచి పోషకాహారం కూడా. తురిమిన లేదా ముక్కలు చేసిన బీట్‌రూట్‌తో ఫ్రైడ్ రైస్ చేయండి. బీట్‌రూట్ అన్నం అందమైన గులాబీ రంగును ఇస్తుంది సూక్ష్మమైన తీపిని కూడా చేరుస్తుంది. 

Image Credits: Adobe Stock

వేసవిలో నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?