కొన్ని రకాల పండ్లు శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచలగవు. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు సహకరిస్తాయి.
Photo; Pexels
కొన్ని పండ్లు తినడం వల్ల జీర్ణం మెరుగ్గా అయి, పేగుల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అలాంటి ఐదు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి.
Photo; Pexels
పైనాపిల్‍లో బ్రోమలైన్ మెండుగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువే. అందుకే ఈ పండు తింటే జీర్ణక్రియ బాగుంటుంది.
Photo; Pexels
యాపిల్‍లో సోలబుల్ ఫైబర్ అయిన పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణం బాగా అవుతుంది. మలబద్ధకం సమస్యను కూడా యాపిల్ నిరోధించగలదు.
Photo; Pexels
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరానికి మంచి హైడ్రేషన్ అందడంతో పాటు ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది.
Photo; Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు ఇవి మేలు చేస్తాయి. పేగుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
Photo; Pexels
కివీ పండల్లో సోలబుల్, ఇన్‍సోలబుల్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. యాక్టినిడిన్ కూడా ఉంటుంది. దీంతో ఈ పండు పేగుల కదలికలను మెరుగు పరిచి జీర్ణవ్యవస్థ బాగుండేలా తోడ్పడుతుంది.
Photo; Pexels
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు