మీ జ్ఞాపకశక్తి మెరుగయ్యేందుకు ఉపయోగపడే 5 రకాల ఆహారాలు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 08, 2023

Hindustan Times
Telugu

మీరు తినే ఆహారం మెదడు పనితీరుకు కీలకంగా ఉంటుంది. కొన్ని రకాల పోషకాలు తీసుకుంటే మెదడు చిరుగ్గా పని చేసేందుకు సహకరిస్తాయి. మీ జ్ఞాపకశక్తి, మెదడు పని తీరు మెరుగయ్యేందుకు సహకరించే ఐదు రకాల ఆహారాలు (ఫుడ్స్) ఇవే.

Photo: Unsplash

కోడిగుడ్డులోని పచ్చసొనలో విటమిన్ బి6, విటమిన్ బీ12, ఫోలెట్, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. మీ మూడ్‍ను నియంత్రించి, మీ జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

Photo: Unsplash

సాల్మోన్, టునా లాంటి ఫ్యాటీ చేపల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అందుకే వీటిని తింటే మెమరీ షార్ప్ అవుతుంది. మెదడు కణాలు వృద్ధి చెందుతాయి. 

Photo: Unsplash

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు లాంటి బెర్రీస్ తింటే మెదడు డీజనరేషన్‍ తగ్గుతుంది. మీ ఒత్తిడి ఇవి తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. 

Photo: Unsplash

బాదంపప్పు, వాల్‍నట్ (అక్రోటుకాయ) లాంటి నట్స్ తినడం ల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడు పనితీరును కూడా ఇవి మెరుగుపరుస్తాయి. 

Photo: Unsplash

బీట్‍రూట్‍లో నేచురల్ నైట్రేట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతుంది.

Photo: Unsplash

బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే 5 రకాల నట్స్ ఇవి

Photo: Pixabay