అధిక రక్తపోటుకు ఆహారాలు

రక్తపోటును తగ్గించేందుకు ఈ 5 ఆహారాలు తీసుకోండి

PEXELS, MEDICAL NEWS TODAY

By Hari Prasad S
May 23, 2025

Hindustan Times
Telugu

అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలకు దారి తీసే అవకాశాలను గణనీయంగా పెంచుతుంది.  దీనికోసం జీవనశైలిలో మార్పులతోపాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది.

PEXELS

రక్తపోటును తగ్గించే 5 ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూడండి

PEXELS

బెర్రీలు

మీ రక్తపోటును తగ్గించడంలో బెర్రీలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని స్నాక్స్‌గా, స్మూతీలలో లేదా ఓట్ మీల్స్‌లో ఆస్వాదించండి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

PEXELS

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియంను ఎదుర్కోవడం ద్వారా, రక్తనాళాల ఉద్రిక్తతను తగ్గించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

PEXELS

బీట్ రూట్

డైటరీ నైట్రేట్ అధికంగా ఉండే బీట్ రూట్ రసం రక్తపోటు ఉన్నవారిలో సిస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 

PEXELS

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లోని కొకొలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. కానీ అతిగా మాత్రం తీసుకోకూడదు.

PEXELS

కివీస్

ఏడు వారాల పాటు ప్రతిరోజూ రెండు కివీస్ తినడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 2.7 ఎంఎంహెచ్జి తగ్గుతుంది. విటమిన్ సి కూడా అందిస్తుంది. 

PEXELS

మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి