రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండేందుకు ఈ 5 పనులు తప్పక చేయండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jul 30, 2024
Hindustan Times Telugu
వ్యాధులు, ఇన్‍ఫెక్షన్ల నుంచి పోరాడాలంటే శరీరంలోని రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుత జీవన శైలి ఈ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తోంది. అయితే, కొన్ని మార్గాలను రెగ్యులర్‌గా పాటించడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు.
Photo: Pexels
మీ శరీర బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోండి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. శరీర బరువు ఉండాల్సిన దానికన్నా ఎక్కువైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి.
Photo: Pexels
రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండేందుకు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి ఇమ్యూన్ కణాలను, పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు ఉండే పండ్లు, కూరగాయాలు, నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
Photo: Pexels
అధికంగా ఒత్తిడి, ఆందోళన చెందడం కూడా రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. అందుకే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండేందుకు ప్రతీరోజు మెడిటేషన్ లాంటివి చేయాలి.
Photo: Pexels
నిద్ర కూడా రోగనిరోధక శక్తికి చాలా మేలు. అందుకే ప్రతీ రోజు కావాల్సినంత నిద్రించాలి. నిద్ర కోసం రెగ్యులర్‌గా షెడ్యూల్ పాటిస్తే ఇంకా మంచిది.
Photo: Pexels
శరీరంలో రోగనిరోధక శక్తి కణాలు పెరగాలంటే శారీరక వ్యాయామం కూడా ముఖ్యం. ప్రతీ రోజు ఎక్సర్‌సైజ్‍లు, రన్నింగ్, వాకింగ్ లాంటివి చేస్తే ఇమ్యూనిటీ మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
నెయ్యిని ఎందుకు వాడాలో తెలుసా..! ఈ 6 కారణాలు తెలుసుకోండి