శరీరంలో జీవక్రియను పెంచే 5 అలవాట్లు ఇవి.. తప్పక పాటించాలి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 26, 2025
Hindustan Times Telugu
శరీరంలోని వ్యవస్థలు బాగా పని చేయాలంటే జీవక్రియ (మెటబాలిజం) మెరుగ్గా ఉండడం చాలా ముఖ్యం. తినే ఆహారం నుంచి వివిధ భాగాలకు పోషకాలు అందాలంటే ఇది చాలా కీలకం.
Photo: Pexels
జీర్ణం, కణాల ఆరోగ్యం, శ్వాస సహా చాలా విషయాలకు జీవక్రియ బాగుండాలి. బరువు తగ్గేందుకు కూడా ఇది ముఖ్యం. కొన్ని అలవాట్లను పాటించడం వల్ల శరీరంలో ఈ జీవక్రియ రేటు మెరుగ్గా ఉంటుంది. అవేంటంటే..
Photo: Pexels
ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తింటే శరీరంలో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ప్రొటీన్ జీర్ణమయ్యేందుకు ఎక్కువ ఎనర్జీ అవసరం. దీంతో జీవక్రియ రేటు అధికం అవుతుంది.
Photo: Pexels
ఎక్కువ తీవ్రతతో ఉండే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది.
Photo: Pexels
ఎక్కువసేపు ఓ చోట కూర్చోకుండా నిలబడడం, నడవడం లాంటివి చేయాలి. దీనివల్ల జీవక్రియ ఎప్పుడూ మెరుగ్గా ఉంటుంది.
Photo: Pexels
గ్రీన్ టీ, క్యాప్సికం, అల్లం లాంటి థర్మోజెనిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా జీవక్రియ అధికం అవుతుంది.
Photo: Pexels
వెయిట్ లిఫ్టింగ్ లాంటి స్ట్రెంథ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్‍లు చేయడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. ఎక్కువ క్యాలరీలు బర్న్ అయ్యేందుకు ఈ రకం వ్యాయామాలు ఉపకరిస్తాయి.
Photo: Pexels
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.