మీ ఎముకల బలం పెరగడానికి ఈ 5 ముఖ్యమైన టిప్స్ పాటించండి

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 23, 2023

Hindustan Times
Telugu

మానవ శరీరంలో ఎముకలు అత్యంత ముఖ్యమైనవి. మనిషి ఆరోగ్యం బాగుండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి. 

Photo: Unsplash

ఎముకల బలాన్ని పెంచుకునేందుకు ముఖ్యమైన 5 టిప్స్ ఇక్కడ చూడండి. 

Photo: Unsplash

ఎముకల బలం పెరిగేందుకు ఆహారం కూడా చాలా ముఖ్యం. పాలు, చేపలు, బాదంపప్పు, గ్రీన్ కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకుంటే మీ ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.

Photo: Unsplash

ఎముకల ఆరోగ్యం శరీర బరువుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. ఎక్కువ బరువు ఉంటే ఎముకలపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అంటే శరీర బరువును ఉండాల్సిన రేంజ్‍లోనే మెయింటెన్ చేస్తూ ఉండాలి. 

Photo: Unsplash

వర్కౌట్స్, వెయిట్ ట్రైనింగ్స్ చేస్తే ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. 

Photo: Unsplash

మీరు తినే ఆహారంలో విటమిన్ డీ, విటమిన్ కే ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.

Photo: Unsplash

పొగతాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లు.. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఎముకలు బలంగా ఉండాలంటే పొగతాగడం, మద్యం సేవించడం లాంటివి చేయకూడదు. 

Photo: Unsplash

శరీరంలో ఐరన్‍ను పెంచే 5 రకాల జ్యూస్‍లు ఇవి

Photo: Pixabay