గుండె వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు శరీరంలో కొలెస్ట్రాల్ (కొవ్వు) స్థాయిలు అదుపులో ఉండాలి. ఎక్కువ అవకూడదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‍ను కంట్రోల్‍లో ఉంచగలిగే ఐదు రకాల ఆహారాలు ఇవే.
Photo: Pexels
శెనగలు, బీన్స్, వేరుశనగ కాయలు, సోయాబీన్స్ లాంటి పప్పు, కాయధాన్యాల్లో ఫైబర్, మినలర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
సాల్మోన్, సార్డైన్స్ లాంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో శరీరంలో కొవ్వు స్థాయిలు అదుపు ఉండేందుకు ఇవి సహకరిస్తాయి.
Photo: Pexels
పాలకూర, కేల్, బచ్చలి లాంటి ఆకుకూరల్లో ల్యూటెన్, కరెటోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Photo: Pexels
యాపిల్స్, బెర్రీలు, ద్రాక్ష, నారింజతో పాటు మరిన్ని పండ్లలో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు ఇవి కూడా ఉపకరిస్తాయి.
Photo: Pexels
ఓట్స్‌లో బీటా గ్లుకాన్ అనే సోలబుల్ ఫైబర్ ఉంటుంది. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే రెగ్యులర్‌గా మీ డైట్‍లో ఓట్స్ తీసుకుంటే మేలు.
Photo: Pexels
బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..