ఎముకలు సాంద్రతను కోల్పోయి గుల్లబారి చిన్న దెబ్బలకు కూడా విరిగిపోయే దశను ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా ముఖ్యం.
Photo: Pexels
ఎముకలు గుల్లగా మారి ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించేందుకు కొన్ని రకాల ఆహారాలు సహకరిస్తాయి. వాటిలో ఐదు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
కోడిగుడ్లలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. శరీరం కాల్షియంను శోషించుకునేందుకు తోడ్పడుతుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికి గుడ్లు మేలు చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ నివారణకు సహకరిస్తాయి.
Photo: Pexels
పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల దృఢత్వాన్ని ఇది పెంచగలవు. పాలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత మెరుగవుతుంది.
Photo: Pexels
బాదం, ఆక్రోటు లాంటి నట్స్‌లో ఒమేగా-3, 6 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నిషియం, కాల్షియం, జింక్, పాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల దృఢత్వాన్ని ఇవి పెంచగలవు.
Photo: Pexels
సాల్మోన్, సార్డినెస్ లాంటి చేపల్లో కాల్షియం, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. వీటి వల్ల ఎముకల బలం పెరిగి, ఆస్టియోపోరోసిస్ నివారణకు సహకరిస్తుంది.
Photo: Pexels
బ్రకోలీ, కేల్, పాలకూర లాంటి వాటిలో విటమిన్ కే, కాల్షియం, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే ఎముకల సాంద్రత మెరుగవుతుంది.
Photo: Pexels
చర్మ ఆరోగ్యానికి ఉల్లి ఆకు తినండి..! 6 సరైన కారణాలు