మలబద్ధకం సమస్యను తగ్గించగల 5 రకాల డ్రింక్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 14, 2024

Hindustan Times
Telugu

మలబద్ధకం సమస్య తగ్గేందుకు కొన్ని రకాల డ్రింక్స్ తోడ్పడతాయి. వీటిని డైలీ తాగితే ఉపశమనం ఉంటుంది. అలా.. మలబద్ధకాన్ని తగ్గించగల 5 రకాల జ్యూస్‍లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

యాపిల్ జ్యూస్‍లో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఈ జ్యూస్ తాగితే పేగుల కదలిక మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 

Photo: Pexels

నిమ్మరసంలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణం మెరుగ్గా అయ్యేందుకు తోడ్పడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగేందుకు సహకరిస్తుంది. 

Photo: Pexels

నారింజ జ్యూస్‍లో ఫైబర్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. జీర్ణాన్ని ఇది మెరుగుపరచగలదు. 

Photo: Pexels

కలబంద జ్యూస్ కూడా మలబద్ధకాన్ని తగ్గించగలదు. కలబందలో కీరదోస, పుదీనా వేసుకొని జ్యూస్‍లా తీసుకోవచ్చు.

Photo: Pexels

అల్లం టీ కూడా మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఇందుకు తోడ్పడతాయి. జీర్ణక్రియకు కూడా ఇది సహకరిస్తుంది.

Photo: Pexels

వర్షాకాలంలో ఉసిరికాయ జ్యూస్ తాగడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి