ఈ 10 విషయాల్లో మగవారి కన్నా ఆడవాళ్లే ది బెస్ట్ అట!
pexel
By Ramya Sri Marka Apr 16, 2025
Hindustan Times Telugu
ఆడవారిని చాలా మంది చులకనగా తీసి పారేస్తారు. కానీ చాలా విషయాల్లో మగవారి కన్నా ఆడవారే గొప్ప లక్షణాలు కలిగి ఉంటారట. ఆ విషయాలేంటో చూద్దాం రండి.
pexel
సహనం విషయంలో మగవారి కన్నా ఆడవారే గొప్పవారట. కష్టాలు, ఒత్తిళ్లను వీరు ఎంతో సహనంతో తట్టుకుంటారు.
pexel
ఒకేసారి అనేక పనులు చేయడంలో ఆడవారు మగవారిని మించిపోతారట.ఇంటిపని, ఆఫీసు పని, పిల్లల బాగోగులు అన్నీ బ్యాలన్స్ చేయగల శక్తి ఎక్కువగా ఉంటుంది.
pexel
మగవారితో పోలిస్తే ఆడవారిలో నొప్పిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రసవం, పీరియడ్స్ సమయాల్లో వీరి భరించే నొప్పే ఇందుకు నిదర్శనం.
pexel
పరిస్థితులను, వ్యక్తులను అంచనా వేయడంలో కూడా మగవారి కన్నా ఆడవారే సరిగ్గా ఉంటారట. ముందే పసిగట్టి జాగ్రత్త పడగలరు.
pexel
మాటల్లో స్పష్టత, అనుభూతులు పంచుకోవడం విషయంలో మగవారి కన్నా ఆడవారే మెరుగ్గా ఉంటారు. వీరు ఇతరులతో బాగా మాట్లాడగలరు, ఎలాంటి విషయమైనా స్పష్టంగా చెప్పగలరు.
pexel
అందరితో కలివిడిగా, స్నేహంగా, ప్రేమగా మెలగడంలో ఆడవారి పాత్ర మెచ్చుకోదగినదే చెప్పుకోవాలి.
pexel
సమయాన్ని, వస్తువులను చక్కగా ఉపయోగించగల సామర్థ్యం మగవారి కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. ఏ పనిని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చక్కగా ప్లాన్ చేయగలరు.
pexel
ప్రేమ, జాలీ వంటి మంచి భావాలను చూపించడంలో ఆడవారు ఎప్పుడూ మగవారి కన్నా పైస్థాయిలోనే ఉంటారు. ఇతరుల బాధపడుతుంటే సహాయం చేయాలని తపన పడుతుంటారు.
pexel
అంగీకరించడం, అడ్జస్ట్ అవడంలో కూడా ఆడవారు చాలా గొప్పవారు. వీళ్లు ఏ పరిస్థితినైనా త్వరగా అంగీకరిస్తారు. మార్పులకు అలవాటు పడటం, కొత్త జీవితానికి అడ్జస్ట్ అరవగలుగుతారు.
pexel
మగవారితో పోలిస్తే పట్టుదల, ధైర్యం ఆడవారిలోనే ఎక్కువట. వీరు ఏ పని మొదలుపెట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. మధ్యలోనే వదిలేసే వారు చాలా తక్కువ.