ఆరోగ్యకరమైన లైంగిక జీవితం శారీరక, మానసికంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు మీ ఉత్సాహాన్ని, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. లైంగిక చర్యకు ముందు ముఖ్యంగా పురుషులు తినాల్సిన పది ఆహారాలు గురించి తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Feb 16, 2025
Hindustan Times Telugu
ఆయిస్టర్స్ -షెల్ ఫిష్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది లైంగిక పనితీరులో ముఖ్యపాత్ర పోషించే హార్మోన్. జింక్ పురుషులలో ఎక్కువ స్పెర్మ్ ను ఉత్పత్తి చేయడంలో కూడా సహాయపడుతుంది. స్పెర్మ్ బాగా కదలడానికి సహాయపడుతుంది.
pexels
స్ట్రాబెర్రీలు - స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది లైంగిక కోరికలను ఉత్తేజపరుస్తాయి. రక్త ప్రవాహాన్ని పెంచడానికి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. లైంగిక ప్రేరేపణ, ఉద్వేగానికి సంబంధించిన లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు సహాయపడుతుంది.
pexels
ఫ్యాటీ ఫిష్ -సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు లైంగిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
pexels
పాలకూర- పాలకూర లైంగిక కోరికలను పెంచుతుంది. ఈ ఆకుకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో టెస్టోస్టెరాన్‌ను పెంచే మినరల్ ఇది. ఇందులోని ఐరన్ కోరిక, ఉద్రేకం, ఉద్వేగం, లైంగిక సంతృప్తికి సహాయపడుతుంది.
pexels
అవకాడో- ఈ క్రీమీ ఫ్రూట్ గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ను అందిస్తుంది. అవకాడోలోని విటమిన్ బి6 అలసట, ఉబ్బరం. తిమ్మిరి వంటి లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రొమాంటిక్ మూడ్‌ను తెచ్చేందుకు సహాయపడతాయి.
pexels
పుచ్చకాయ- ఈ పండు సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లాన్ని పుష్కలంగా అందిస్తుంది. శరీరం దానిని అర్జినిన్‌గా మారుస్తుంది. రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. ఇది లైంగిక అవయవాలలో రక్తాన్ని పంపింగ్ చేస్తుంది.
pexels
కాఫీ లేదా టీ - ఈ పానీయాలు కెఫిన్ ను అందిస్తాయి. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పురుషులు బెడ్‌రూమ్‌లో మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కెఫిన్ అంగస్తంభన సమస్యలను తగ్గిస్తుంది. కాఫీ, టీలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి.
pexels
దానిమ్మ- దానిమ్మ సంతానోత్పత్తికి చిహ్నంగా, లైంగిక శక్తిని పెంచేదిగా ప్రసిద్ధి. దానిమ్మ రసం తాగడం వల్ల మీ మానసిక స్థితి కుదుటపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
pexels
చాక్లెట్ - చాక్లెట్ శృంగారం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. చాక్లెట్ సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలకు సాయపడుతుంది. చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు లైంగిక కోరికను పెంచుతుంది. ఈ ఆనంద సమయంలో మెదడులో ఫినైల్థైలమైన్ పుష్కలంగా విడుదల అవుతుంది.
pexels
మకా- పెరువియన్ పర్వతాల్లో దొరికే మకా శతాబ్దాలుగా సంతానోత్పత్తిని పెంచడానికి ఉపయోగించబడుతోంది. ఈ వేరు లైంగిక కోరికను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలోని ఫైటోన్యూట్రియెంట్లు స్పెర్మ్ కౌంట్, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. మకా రూట్‌ను పౌడర్‌గా అమ్ముతారు. దీన్ని పెరుగు, స్మూతీలు, సలాడ్‌లు, సూప్‌లు లేదా బేక్ చేసిన వస్తువులకు జోడించవచ్చు.
pexels
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు