ఏపీలో జరుగుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు, నాటి అధికార్ల అరెస్టులపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు, పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేయాలనుకుంటే, దాడి చేయాలనుకుంటే చేసుకోమనండి.. కానీ పేర్లు మాత్రం రాసుకోండని కార్యకర్తలకు జగన్ సూచించారు. అన్యాయం చేసినవారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు.