YS Sharmila Challenge: కేసీఆర్ గారూ.. దమ్ముంటే మాతో పాదయాత్ర చేయండి
- YS Sharmila Challenges Telangana CM KCR To Join Padyatra :సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె... ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. అవి వేసుకొని రాష్ట్రంలో తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవంటున్న సీఎం కేసీఆర్ అది నిజం అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్ చేశారు. అదే నిజం కాకపోతే సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ జిల్లా నుంచి ప్రజాప్రస్థానం యాత్రను పునఃప్రారంభించనున్నారు.