దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేళ వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. వారితోనే కేక్ కూడా కట్ చేయించారు. శిశు భవన్ దగ్గరికి వైయస్ జగన్ వస్తున్నారన్న సమాచారంతో.... వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.