FIFA World Cup 2022: జపాన్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి అందరూ ఫిదా.. వైరల్ వీడియో-viral video japan fans lauded for being class apart after fifa win over germany ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Fifa World Cup 2022: జపాన్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి అందరూ ఫిదా.. వైరల్ వీడియో

FIFA World Cup 2022: జపాన్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి అందరూ ఫిదా.. వైరల్ వీడియో

Published Nov 24, 2022 02:24 PM IST Chatakonda Krishna Prakash
Published Nov 24, 2022 02:24 PM IST

FIFA World Cup 2022: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‍లో జర్మనీపై మ్యాచ్ గెలిచి జపాన్ అదరొగొట్టింది. ఖలీఫా స్టేడియం వేదికగా జరిగిన పోరులో ఆటతో ప్లేయర్లు అలరిస్తే.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన జపానీస్ అభిమానులు కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియంలో పడి ఉన్న ఖాళీ బాటిళ్లు, చెత్తను జపాన్ ఫ్యాన్స్ కొందరు ఏరారు. వారు కూర్చున్న చుట్టుపక్కల ఎలాంటి చెత్త లేకుండా శుభ్రం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జపాన్ అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More