Tigers In Adilabad : పెన్ గంగ ప్రాజెక్టు కాలువలో పులులు
- పెన్ గంగ ప్రాజెక్టు కాలువలో రెండు పులులు కనిపించాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం నుంచి అవి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రాజెక్టు ఇంజినీర్లు జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పులుల ఉనికిని గమనించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.