మణిపూర్‌లో వరదల దాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో జనాలు నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న నివాసితులను మణిపూర్ అగ్నిమాపక దళం, అస్సాం రైఫిల్స్, ఎస్డీఆర్ఎప్, ఎన్డీఆర్ఎప్ బృందాలు రక్షించాయి. సురక్షితమైన ప్రదేశానికి తరలిస్తున్నారు.