container school in mulugu district: తొలి కంటైనర్ స్కూల్.. టీచర్ అయిన సీతక్క!
- తెలంగాణలో తొలి కంటైనర్ పాఠశాల ములుగు జిల్లాలో ఏర్పాటైంది. కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయ గుంపు అటవీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో పాఠశాల పిల్లలు గుడిసెలో చదువుకుంటున్నారు. అయితే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క చొరవతో కంటైనర్‌ను పాఠశాల భవనంలా మార్చారు. ఇందుకోసం కలెక్టర్ నిధుల నుంచి రూ.13 లక్షలు ఖర్చు చేశారు.