తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రియురాలు తండ్రి గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ చంపాడు. ముప్పిరితోట గ్రామానికే చెందిన ఓ యువతిని సాయికుమార్ ప్రేమించాడు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి తండ్రి సాయికుమార్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ సాయికుమార్ వినకపోవటంతో.. బర్త్ డే సందర్భంగా రాత్రి మిత్రులతో వేడుకలకు సిద్దమైన సమయంలో మాటు వేసిన అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు.