పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనని జైళ్లో వేస్తే 16 రోజులు నిద్రపోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలపై కోపం ప్రదర్శించలేదని తెలిపారు. ఎక్కడి వెళ్లినా వారిని జైల్లో ఎప్పుడు వేస్తావనే ప్రశ్నలు వస్తున్నాయని అసెంబ్లీలో రేవంత్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా రేవంత్ అని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటావా అని నిలదీశారు.