కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు అమలులోకి వచ్చినప్పటి నుంచి పలు చోట్ల గొడవలు చూస్తూ ఉన్నాం. తాజాగా సీటు కోసం గొడవ పడిన ఇద్దరి మహిళల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్యాసింజర్లతో ఫుల్ గా వెళ్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే ఓ మహిళ సీటులో కూర్చుంది. అయితే ఇంతలోనే మరో మహిళ అక్కడి వచ్చి ఆ మహిళతో గొడవ పడింది. ఇద్దరూ సీటు కోసం కొట్టుకున్నారు. అంతు చూస్తా బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.