చిరు వ్యాపారిపై తెలంగాణలో ఓ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలు దారి తీసింది. ఈ ఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. రాత్రి పూట ఓ కొబ్బరి కాయల దుకాణం తెరిచి ఉండడంతో ఆగ్రహించిన స్థానిక సీఐ దుకాణాదారుడి చెంపపై కొట్టారు. షాపు ఎందుకు మూయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.