Breakfast Scheme | తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం-telangana minister ktr participates in launch of cm breakfast scheme at government school ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Breakfast Scheme | తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

Breakfast Scheme | తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

Published Oct 06, 2023 11:10 AM IST Muvva Krishnama Naidu
Published Oct 06, 2023 11:10 AM IST

  • తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం తెచ్చింది. ఇవాళ ఈ స్కీమ్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మారరేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేటీఆర్ అల్పాహారం తీసుకున్నారు. ఈ పథకం 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో ప్రారంభించారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిసింది.

More