దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. NIA కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దోషులు దాఖలు చేసిన అప్పీల్లను హైకోర్టు జడ్జీలు కొట్టి వేశారు. ఎన్ఐఏ కోర్టు తీర్పును న్యాయమూర్తులు సమర్థించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దీంతో కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఐదుగురు దోషులు అప్పీళ్లు దాఖలు చేశారు. కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది.