నిజమైన జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్లను స్క్రీనింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు బానిసలుగా తయారయ్యారని, వారిలో ఇంటర్నల్‌గా బానిసత్వం ఉందన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డుపై తిరిగే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.