తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్శనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన 'ఇందిరా గిరి జల వికాస పథకం'ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాన్ని గుర్తు చేసుకున్న మహిళలు భావోగ్వాదానికి గురి అయ్యారు.