పహల్గాం ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. .తీవ్రవాదుల ముసుగులో పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. నేడు పాకిస్థాన్ కు బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు వేశారని విమర్శించారు. చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే కిషన్ రెడ్డి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.