తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించింది. మనవడి పుట్టి పుట్టెంట్రుకలు మొక్కు ఇవాళ చెల్లించిన రేవంత్ ఫ్యామిలీ అనంతరం శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు మంగళవారం రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రేవంత్ రెడ్డికి టిటిడి ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేశారు.