కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు 40 మందిపై దాడి చేశాయి. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే కుక్కలను పట్టుకునేందుకు మునిసిపల్ సిబ్బంది డాగ్ క్యాచ్ బ్యాచ్ ప్రయత్నించగా మునిసిపల్ సిబ్బందిపై ఓ కుక్క దాడికి పాల్పడింది. మున్సిపల్ సిబ్బంది సైతం నలుగురు గాయపడ్డారు. స్థానికులు మున్సిపల్ సిబ్బంది కలిసి పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు.