పిట్టల కిలకిల రాగాలు కానరావడం లేదు. పర్యావరణ పరిరక్షణ, వైవిద్య జీవనానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు కనిపించడం లేదు. ఇందుకు కారణాలు అనేకం. మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ మహమ్మారి. రేడియేషన్ ప్రభావంతో పిట్టల సంతతి రోజు రోజుకు అంతరించి పోతుందనటంలో అతిశయోక్తి లేదు. అయితే కొందరు పక్షి ప్రేమికులు వాటిని కాపాడటం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే కరీంనగర్ లోని అనంతుల రమేశ్ ఉన్నారు. అందుకే ఈయన పేరు పిట్టల రమేశ్, బర్డ్ ప్రేమికుడిగా పిలుస్తుంటారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆయన ఇంటిని పలువురు సందర్శించి పిట్టల సందడిని ఆస్వాదిస్తున్నారు.