బెట్టింగ్ యాప్స్ కేసులో నటి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఈ రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు ఆమె వచ్చారు. ఈ క్రమంలో స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సుమారు గంటన్నర పాటు విచారించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తా అని చెప్పిన శ్యామల, బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దానిపై స్పందించలేనని అన్నారు.