రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లిపడిపోయింది. రాహుల్ ను చూసేందుకు వచ్చిన ఆమె.. దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనను చూసిన రాహుల్.. వెంటనే వృద్ధురాలి దగ్గరకు వెళ్లారు. వృద్ధురాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నీళ్లు ఇవ్వండి అంటూ చెప్పారు. ఆమె చెప్పులను స్వయంగా రాహుల్ అందించారు.