Rahul Gandhi Banners | తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ పోస్టర్లు
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ ఆ పోస్టర్లలో రాశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు.. రాహుల్ గాంధీ హైదరబాదుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్టర్లు కట్టినట్లు తెలుస్తోంది. మరో 13 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం నడుస్తోంది. అటు ఆన్లైన్ లో ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలసిన ఈ పోస్టర్లపై ఆ పార్టీ నాయకులు ఇంకా స్పందించలేదు.