మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వనదేవతల ఆగమనంతో అడవి బిడ్డలు పులకరించిపోయారు. వారి దీవెనలు, మెుక్కల కోసం లక్షలాది జనం క్యూ కట్టారు. జాతరలో అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించారు. వేలాది మంది పోలీసుల రక్షణ వలయంలో చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఉద్విగ్నభరిత వాతావరణంలో తరలివచ్చింది. ఇక అమ్మవారి రాక సందర్భంగా వడ్డెలు ఇష్టరాగాలు ఆలపించారు.