తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా డమ్మీలని..అంతటా అడ్వైజర్లే ఫైళ్లు నడుపుతున్నారని కరీంనగర్ BJP ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే.. ఉద్యోగాలు కల్పించమని బీజేపీ దీక్ష చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచి, నిరుద్యోగుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ సర్కారు..ఎలా తీర్చుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు నెరవేర్చేవి కావన్నారు. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి ఎటువంటి ప్రభుత్వ లబ్ది రావటం లేదన్నారు. జమిలి ఎన్నికలు వస్తే డిపాజిట్లు రావని బీఆర్ఎస్ భయపడుతోందని బండి వ్యాఖ్యనించారు. జమిలి ఎన్నికలు వస్తాయని బీజేపీ ఎక్కడా చెప్పలేదని,మోదీ చరిస్మా ముందుకు ఈ ముఖాలు వెలవెలబోతాయన్నారు.ప