బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె అన్నారు. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందన్నారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. గత 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని కవిత మండిపడ్డారు.