బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారిన ఎమ్మెల్యే సంజయ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. 119 మంది ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తే సంజయ్ ర్యాంకు 108 అని ఎద్దేవా చేశారు. ఒకసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో, మరోసారి బీజేపీ ఎంపీ అరవింద్‌తో కనిపిస్తారని విమర్శించారు. ఆంధ్ర పాలనలో తెలంగాణ యాసతో మనం అవమానపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.