BRS Bhavan: ప్రభుత్వం నుంచి నియోజకవర్గంలో పంపిణీ చేసే చెక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ పై వివక్ష చూపుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో కాకుండా ఓడిపోయిన వ్యక్తితో పంపిణీ చేయటం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.