గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. హాల్ టికెట్ నెంబర్ పక్క పక్కనే ఉన్న 654 మందికి ఒకే మార్కులు వచ్చాయన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆ రెండు సెంటర్ లలో కేవలం ఆడవాళ్లను మాత్రమే ఎందుకు పరీక్ష రాయించారని అనుమానం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి